మరో రెండురోజుల్లో ప్రారంభంకానున్న రంజీ ట్రోఫీ నుంచి బరోడా కెప్టెన్ హార్దిక్‌పాండ్యా తప్పుకున్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌పై దృష్టిసారించిన హార్దిక్ మళ్లి జట్టులోకి పునరాగమనం చేయాలని భావిస్తున్నాడు. హార్దిక్‌పాండ్యా రంజీట్రోఫీలో ఆడతాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంతకుముందు ప్రకటించాడు. ఆల్‌రౌండర్ కోటాలో టీమిండియాలోకి అడుగుపెట్టిన హార్దిక్ వెన్నెముక గాయంతో బౌలింగ్‌కు దూరమయ్యాడు. కేవలం బ్యాటర్‌గానే ఆడుతున్నా ఆశించిన మేరకు రాణించలేకపోవడంతో జట్టుకు దూరమయ్యాడు.
ఈనేపథ్యంలో హార్దిక్ మళ్లి బౌలింగ్‌పై దృష్టి సారించాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు హార్దిక్ స్థానంలో చోటుదక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్ విఫలమవడంతో హార్దిక్‌కు తలుపులు తెరుచుకున్నాయి. మరోవైపు ఐపీఎల్లో ఈ ఏడాది కొత్తగా అడుగుపెడుతున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి హార్దిక్‌పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా ఈ నెల 10నుంచి ప్రారంభమయ్యే రంజీట్రోఫీలో పాల్గొనే బరోడా జట్టుకు హార్దిక్‌పాండ్య స్థానంలో కేదార్ దేవ్‌ధర్ సారథిగా వ్యవహరించనున్నాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..