పంజాబ్ గవర్నర్ చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరీలాల్ పురోహిత్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. 83 ఏళ్ల బన్వరీలాల్.. వ్యక్తిగత కారణాల చేత తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాజీనామా లేఖను పంపించారు. శుక్రవారమే ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మరుసటి రోజే ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
లేఖలో ఏముందంటే..
బన్వరీలాల్‌కు ప్రస్తుతం 83 ఏళ్లు. వ్యక్తిగత కారణాలు , కొన్ని ఇతర కట్టుబాట్లతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. దయచేసి తన రాజీనామాను ఆమోదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పురోహిత్ గతంలో తమిళనాడు, అసోం రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. అలాగే మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. రెండు సార్లు బీజేపీ నుంచి, ఒకసారి కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు వెళ్లారు.