Tuesday, November 26, 2024

Banned – న్యూడ్ కంటెంట్ – 18 ఓటిటిల‌పై కేంద్రం వేటు..

అశ్లీల యాప్ ల‌పై ఉక్కుపాదం
19 వెబ్ సైట్, 10 యాప్ 57 సోష‌ల్ మీడియా
ఖాతాలు బ్లాక్ చేసిన కేంద్రం
గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొల‌గించాల‌ని ఆదేశం.

న్యూ ఢిల్లీ – కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్‌ చేసింది. దేశంలో పబ్లిక్ యాక్సెస్‌ ఉన్న 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు, ఈ ప్లాట్‌ఫామ్స్‌కు అనుసంధానంగా ఉన్న 57 సోషల్ మీడియా ఖాతాలు నిలిపివేసింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్రం ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. అశ్లీల కంటెంట్‌ని వెంటనే తొలగించాలని ఆదేశించింది. అయితే, కేంద్రం హెచ్చరికలను ఆయా ప్లాట్‌ఫామ్స్‌ పట్టించుకోలేదు. దీంతో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆదేశాల మేరకు ఆయా సంస్థలపై వేటు వేసినట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా 10 యాప్స్‌ని వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఇందులో గూగుల్‌ ప్లే స్టోర్‌లో 7 యాప్స్, యాప్‌స్టోర్‌లో మూడు యాప్స్‌ ఉన్నాయి.

కేంద్రం నిషేధం విధించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో డ్రీమ్స్‌ ఫిల్మ్స్‌, అన్‌కట్‌ అడ్డా, వూవీ, యేస్మా, ట్రై ఫ్లిక్స్‌, ఎక్స్‌ ప్రైమ్‌, నియోన్‌ ఎక్స్‌ వీఐపీ, బేషరమ్స్‌, హంటర్స్‌, రాబిట్‌, ఎక్స్‌ట్రా మూడ్‌, మూడ్‌ఎక్స్‌, మోజ్‌ఫ్లిక్స్‌, హాట్‌ షార్ట్స్‌ వీఐపీ, ఫ్యూజీ, ప్రైమ్‌ ప్లే తదితర ఓటీటీలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement