రేపటి నుంచి వరుసగా బ్యాంకులు నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. రేపు రెండో శనివారం, మరుసటి రోజు ఆదివారం తో పాటు సాధరణంగా బ్యాంకులకు సెలవులు అయితే ఆ మరుసటి రోజు సోమవారం, మంగళవారం నాడు బ్యాంకులు మూతపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్న తరుణంలో రెండు రోజుల పాటు నిరసనగా ఉద్యోగ సంఘాలు బంద్ చేపట్టనున్నాయి. బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేస్తే తప్పా ఈ నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడటం ఖాయం. ఈ నాలుగు రోజుల్లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథాతథంగా కొనసాగనున్నప్పటికీ, బ్యాంక్ బ్రాంచ్ సేవలు మాత్రం నిలిచిపోనున్నాయి.ఏటీఎం సేవలకూ తీవ్ర విఘాతం కలగవచ్చు
Advertisement
తాజా వార్తలు
Advertisement