బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఘోరక్పూర్ రీజియన్లోని ఏడు జిల్లాల్లో ఉన్న బ్రాంచీల్లో ఖాళీగా ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. పోస్టుల సంఖ్యను స్పష్టం చేయలేదు. ఆఫ్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 29 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
పోస్టు పేరు: బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్
అర్హతలు: డిగ్రీ పూర్తిచేసి, కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. ఎమ్మెస్సీ ఐటీ, బీఈ ఐటీ, ఎంసీఏ, బీబీఏ చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు. అభ్యర్థులు 21 నుంచి 45 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులో పేర్కొన్న అర్హతలను బట్టి ఎంపికచేసినవారిని ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: Regional Manager Bank of Baroda,
Regional Office, Gorakhpur Region,
Hanuman Mandir Crossing , Betiahata,
Gorakhpur- 273001
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 29
వెబ్సైట్: https://www.bankofbaroda.in/
ఇది కూడా చదవండి: ఈ రోజు బంగారం ధర ఎంతో తెలుసా..