Friday, November 22, 2024

లాభాల్లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా..

న్యూఢిల్లి, (ప్ర‌భాన్యూస్): సెప్టెంబర్‌తో ముగిసిన రెండోత్రైమాసిక ఫలి తాలను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బుధవారం ప్రకటించింది. ఏడా ది ప్రాతిపదికన ఏకంగా 24.4 శాతం పెరుగుదలతో రూ. 2,088 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్‌ ప్రకటించింది. వడ్డీయేత ర ఆదాయంతోపాటు ఫీజలు, మాఫీ ఖాతాల నుంచి రివకరీలు పెరిగాయని బ్యాంక్‌ వివరించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.1679 కోట్లుగా ఉందని బ్యాంక్‌ ప్రస్తావించిం ది. త్రైమాసికంపరంగా చూస్తే నికర లా భం రూ.1209 కోట్ల నుంచి రూ.2088 కోట్లకు చేరిందని పోల్చింది. రెండో త్రైమాసికంలో ట్యాక్స్‌ ప్రొవిజన్‌ రూ.872 కోట్ల నుంచి రూ. 828 కోట్లకు తగ్గింది. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 2.11 శా తం వృద్ధి చెంది రూ.7,566 కోట్లుగా నమోదయింది.

గతేడా ది క్యు2లో ఇది రూ.7,410 కోట్లుగా ఉందని బ్యాంక్‌ ప్రస్తావిం చింది. అయితే త్రైమాసికంపరంగా ఎన్‌ఐఐలో క్షీణత నమో దయింది. నికర వడ్డీ మార్జిన్‌ 2.78 శాతం నుంచి 2.85 శాతానికి పెరిగింది. ఎన్‌ఐఎం 2022క్యు1లో 3.04 శాతం ఉండగా 19 బేసిస్‌ పాయింట్లు క్షీణించి 2.78 శాతానికి పడిపోయింది. వడ్డీయే తర ఆదా యం 23 శాతం మేర పెరిగి రూ.2,600 కోట్ల నుంచి రూ.3,579 కోట్లకు పెరిగింది. త్రైమా సికంపరంగా కూడా వడ్డీయేతర ఆదాయంలో పెరు గుదల నమోదయింది. ఇక ఎన్‌పీ ఏల ప్రొవిజన్లు 14.2 శాతం మేర పెరిగి రూ. 2600 కోట్లకు చేరాయి. గతేడాది క్యు2లో ఈ ప్రొవిజన్లు రూ.2,277 కోట్లుగా ఉన్నాయని, ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈపై బీవోఐ షేర్లు 4.61 శాతం మేర క్షీణించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhrap
rabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement