ఆగస్టు నెలలో ఏకంగా 13 రోజులపాటు బ్యాంకు సెలవులు వస్తున్నాయి. ఆర్బీఐ ప్రకటించిన సెలవుల జాబితాను పరిశీలిస్తే బ్యాంకుల ఖాతాదార్లు అప్రమత్తమవ్వక తప్పదు. కొన్ని జాతీయ సెలవులు కాగా కొన్ని ప్రాంతీయంగా అమలు చేసేవి ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు పనిచేయవు. అయితే, ఆన్‌లైన్ లావాదేవీలకు మాత్రం ఎటువంటి ఢోకా ఉండదు. ప్రతినెలలో రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేయని విషయం తెలిసిందే. అవి కాక జాతీయ, ప్రాంతీయ పండుగలు ఉండటంతో ఈనెలలో సెలవుల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఆయా సందర్భాల్లో ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఆగస్టు 1,8,15, 22, 29 ఆదివారాలు. 14,28 రెండు, నాలుగో శనివారాలు సెలవు. ఆగస్టు 1 ద్రుక్ప షేజి (సిక్కిం), 8,9 మొహర్రం, 11-12 రక్షాబంధన్, 13 పేట్రియాట్స్ డే, 15 స్వాతంత్య్ర దినోత్సవం, 16, పార్సీ న్యూఇయర్, 18 జన్మాష్టమి, 19, శ్రావణవ్రతం, కృష్ణ జయంతి, 20 కృష్ణాష్టమని, 29 శ్రీమంట శంకరదేవ తిథి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.