Saturday, November 23, 2024

2వేల నోట్ల ఉపసంహరణతో.. 3.26 లక్షల కోట్లు పెరిగిన బ్యాంక్‌ డిపాజిట్లు

రిజర్వ్‌ బ్యాంక్‌ 2 వేల నోట్లను ఉపసంహరించుకోవడంతో బ్యాంక్‌ల్లో భారీగా డిపాజిట్లు పెరుగుతున్నాయి. నోట్ల ఉపసంహరణ తరువాత బ్యాంక్‌ల్లో ఇప్పటి వరకు 3.26 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. దీంతో బ్యాంక్‌ల్లో జూన్‌ 2 నాటికి మొత్తం డిపాజిట్లు 187.02 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆర్బీఐ విడుదల చేసిన డేటా ప్రకారం 15 రోజుల్లో బ్యాంక్‌ల్లో డిపాజిట్లు 59,623 కోట్ల నుంచి 183.74 లక్షల కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో బ్యాంక్‌ల రుణాలు 11.8 శాతం పెరిగాయి. సంవత్సరం క్రితం ఇది 9.3 శాతం ఉన్నాయి.


జూన్‌ 8న ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటికి 3.62 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు 2023 మార్చి 31 నాటికి చలామణిలో ఉన్నాయని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన తరువాత 1.8 లక్షల కోట్ల విలువైన 2వేల రూపాయల నోట్లు వెనక్కి వచ్చాయి. బ్యాంక్‌ రుణాలు 1.14 లక్షల కోట్ల నుంచి 140.08 లక్షల కోట్లకు పెరిగాయి. క్రెడిట్‌ పోర్టుఫోలియో 15.4 శాతం పెరిగిందని ఆర్బీఐ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement