హైదరాబాద్, ఆంధ్రప్రభ : బంజారాహిల్స్‌లోని ఏపీ జెమ్స్ అండ్ జువెల్లరీకి చెందిన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారన్న అభియోగంపై కేసు నమోదు అయిన ఎంబీ టీజీ వెంకటేష్‌కు ఊరట లభించింది. కేసులోని ఎఫ్ఐఆర్ నుంచి ఆయన పేరును తొలగించినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. ఏపీ జెమ్స్ అండ్ జువెల్లరీస్‌కు కేటాయించిన స్థలాన్ని ఆక్రమించేందుకు కర్నూలు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు ప్రయత్నించిన వ్యవహారం దుమారం రేపింది. భారీ అనుచర గణంతో వచ్చిన సదరు ముఠా భూమికి రక్షణగా ఉన్న సెక్యూరిటీ గార్డులపై దాడి చేసింది. ఈ ఘటనపై ఫిర్యాదును అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఈ ముఠాను తీసుకు వచ్చిన వ్యక్తం టీజీ వెంకటేష్ సమీప బంధువు టీజీ విశ్వప్రసాద్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ వ్యవహారంపై వివరాలను సేకరించిన పోలీసులు అరెస్టయిన నిందితులు తెలిపిన వివరాల మేరకు రాజ్యసభ సభ్యుడు టీడీ వెంకటేష్ పేరును కూడా ఎఫ్ఐఆర్ ఏ 5 నిందితుడిగా చేర్చారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకటేష్ భ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ పోలీసులు ఆయన పేరును చేర్చి కోర్టుకు ఎఫ్ఐఆర్ను సమర్పించారు. కేసు దర్యాప్తులో భాగంగా జరిగిన విచారణలో విశ్వప్రసాద్‌కు ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నప్పటికీఎంపీ టీజీ వెంకటేష్‌కు లేదని తేల్చడంతో పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొలగించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..