ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవ్వాల (సోమవారం) జరిగిన మ్యాచ్ లో శ్రీలంకకు షాక్ ఇస్తూ.. బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. బంగ్లాదేశ్ ముందు 280 పరుగుల టార్గెట్‌ని సెట్ చేసింది.
అయితే, చేజింగ్ లో బంగ్లా ఓపెనర్లు చెలరేగి ఆడారు. ఇందులో నజ్ముల్ హుస్సేన్ శాంటో (90) పరుగులతో రెచ్చిపోయాడు.. ఇక, షకీబ్ అల్ హసన్ (82) హాఫ్ సెంచరీతో అదరకొట్టాడు. దీంతో 7 వికెట్ల నష్టాని 42 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది బంగ్లాదేశ్. ఇక శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ రెండు వికెట్లు తీశారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక (108) శతకం బాదాడు. పాతుమ్ నిస్సాంక 41, సదీర సమరవిక్రమ 41, ధనంజయ డిసిల్వా 34, మహేశ్ తీక్షణ 22, కుశాల్ మెండిస్ 19 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తాంజిమ్ హసన్ సాకిబ్ మూడు వికెట్లు తీశాడు. షకీబ్ అల్ హసన్, షారిఫుల్ ఇస్లాం లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మెహిదీ హసన్ మిరాజ్ ఓ వికెట్ సాధించాడు. దీంతో 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది.