వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకున్నాయి. రావల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు పాక్‌పై చారిత్రాత్మకమైన విజయం సాధించింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి ఎగబాకింది. ఇక, పాకిస్థాన్ జట్టు పాయింట్ల 8వ స్థానానికి దిగజారింది.
మరోవైపు ఇంగ్లండ్ – శ్రీలంక మ్యాచ్ లో తొలి మ్యాచ్ ను గెలిచిన ఇంగ్లండ్… 41శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక 40 శాతం పాయింట్లతో శ్రీలంక జట్టు తన స్థానాన్ని మెరుగు పరచుకుని ఐదో స్థానికి చేరుకుంది.
టాప్ లో టీమిండియా..
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఇండియా 6 మ్యాచులు గెలిచి 68.52 శాతం పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇక ఆస్ట్రేలియా (62.50), న్యూజిలాండ్ (50.00) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
ర్యాంకింగ్స్ (పాయింట్ల శాతం)
- ఇండియా (68.52)
- ఆస్ట్రేలియా (62.50)
- న్యూజిలాండ్ (50.00)
- ఇంగ్లాండ్ (41.07)
- శ్రీలంక (40.00)
- బంగ్లాదేశ్ (40.00)
- దక్షిణాఫ్రికా (38.89)
- పాకిస్థాన్ (30.56)
- వెస్టిండీస్ (18.52)