హైదరాబాద్- బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 8 కారిడార్లలో బుల్లెట్ రైళ్లు నడిపేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో తొలివిడతగా ముంబై – అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు నడపాలని, అందుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేసింది. భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీంతోపాటు ఢిల్లి – వారణాసి, ఢిల్లి – అహ్మదాబాద్, ముంబై- నాగ్‌పూర్, ముంబై – హైదరాబాద్, చెన్నై- మైసూర్, ఢిల్లి – అమృత్‌సర్, వారణాసి – హౌరా మార్గాల్లో బుల్లెట్ రైళ్ల కోసం డీపీఆర్‌లు సిద్ధం చేసే పనిలో రైల్వే అధికారులు బిజీబిజీగా ఉన్నారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాజాగా హైదరాబాద్- బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు నడపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి డీపీఆర్ తయారుచేయాలని అధికారుల ను ఆదేశించింది. నాగ్‌పూర్- వారణాసి, పాట్నా – గువహటి, అమృత్‌సర్- జమ్ము మార్గాల్లోనూ బుల్లెట్ రైళ్ల ఏర్పాటుకు రైల్వే శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital