దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎంతోమంది స్టార్లను తయారు చేశారని ..తన కొడుకు సినిమా ఫంక్షన్ జరిగితే రాకపోవడం తనకి నచ్చలేదన్నారు నిర్మాత..నటుడు బండ్ల గణేశ్. పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ నటించిన ‘చోర్ బజార్’ సినిమా రేపు విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. అయితే ఈ ఈవెంట్ కు పూరీ జగన్నాథ్ హాజరు కాలేదు.
ఈ నేపథ్యంలో ఈవెంట్ లో బండ్ల గణేశ్ స్పందించారు. ఇప్పుడు తన కొడుకు సినిమా ఫంక్షన్ జరుగుతుంటే ఆయన రాకపోవడం తనకు నచ్చలేదని అన్నారు. కొడుకు ఈవెంట్ కు హాజరు కావడానికి కూడా సమయం లేదా అని ప్రశ్నించారు. తన కొడుకు సినిమా ఫంక్షన్ అయినట్టయితే… తాను ఎక్కడున్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడినని అన్నారు. ముంబైలో తన సినిమా షూటింగ్ బిజీ వల్ల ఈ ఈవెంట్ కు పూరీ జగన్నాథ్ రాలేకపోవడం గమనార్హం.
సొంత కొడుకు ఈవెంట్ కి రావడానికి పూరీకి ఖాళీ లేదా-బండ్ల గణేశ్
Advertisement
తాజా వార్తలు
Advertisement