నటుడు..నిర్మాత బండ్ల గణేశ్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. ఎలుక రాతిదైతే పూజిస్తాం.. ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం.. పాము రాతిదైతే పాలు పోస్తాం.. ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం ..తల్లిదండ్రుల ఫోటోకి దండేసి దండం పెడతాం.. కానీ ప్రాణాలతో ఉన్నప్పుడు పట్టించుకోము.. చనిపోయిన వారికి భుజాలు అందిస్తాం.. బ్రతికున్నప్పుడు గేటు దగ్గరకు వస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వం ..రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం.. కానీ మనుషులలో మానవత్వం ఉందని గుర్తించలేకపోతున్నాము.. జీవం లేని వాటిపై ఉన్న ప్రేమ, భక్తి ప్రాణాలతో ఉన్నప్పుడు ఎందుకు ఉండదు.. ఒకసారి ఆలోచించుకోండి..” అంటూ వరుస ట్వీట్లు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు.. మరొక ట్వీట్ ద్వారా మనిషి వేసే ప్రతి అడుగు స్వార్థంతోనే..ప్రతి మాట స్వార్ధంతోనే.. పబ్లిసిటీ.. పబ్లిసిటీ.. దీనిని వదిలేసినప్పుడే మానవత్వం బయటకి వస్తుందని ట్వీట్ లో తెలిపారు
పబ్లిసిటీని వదిలేస్తే.. మానవత్వం బయటికి వస్తుంది.. ట్వీట్ చేసిన బండ్ల గణేశ్
Advertisement
తాజా వార్తలు
Advertisement