Tuesday, November 19, 2024

బాలిక అత్యాచార ఘ‌ట‌న‌పై కేసీఆర్ కు బండి సంజ‌య్ లేఖ‌

హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచ‌లనంగా మారింది. ఈ ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాలంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఇందులో అధికార పార్టీ నేత‌ల పిల్ల‌లు ఉన్నార‌ని వ‌స్తున్న వార్త‌ల‌తో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ చేస్తేనే బాధితుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని బండి సంజ‌య్ కేసీఆర్ ను లేఖ ద్వారా కోరారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం తీరు చూస్తుంటే చాలా బాధ‌క‌లిగిస్తుంద‌ని, ఏమీ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని మండిప‌డ్డారు.

నిందితుల‌ను శిక్షించాల‌ని ప్ర‌జ‌ల నుంచి డిమాండ్ పెరుగుత‌న్నా ప్ర‌భుత్వం ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. కేసుపై పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. రాష్ట్రం నాయ‌కుల పిల్ల‌ల హ‌స్తం ఉండ‌డంతోనే ఎవ‌రూ స్పందించ‌డం లేద‌న్నారు. రాష్ట్ర హోంమంత్రి మనవడు, మీకు రాజకీయ మిత్రులైన ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు, టీఆర్ఎస్ నాయకుల కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా ఇప్పటికే మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో అనే వార్తలు వస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement