Thursday, January 23, 2025

KNR | దేవిశెట్టి నవీన్ కుటుంబ సభ్యులకు బండి సంజయ్ పరామర్శ

కరీంనగర్ : బీజేపీ సీనియర్ నాయకులు దేవిశెట్టి నవీన్ కుమార్ కుటుంబ సభ్యులను కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం పరామర్శించారు. కరీంనగర్, గణేష్ నగర్ లోని వారి స్వగృహానికి మంత్రి బండి సంజయ్ వెళ్లారు.

ఈ నెల 17న అనారోగ్యంతో మృతి చెందిన నవీన్‌కుమార్‌ తల్లి దేవిశెట్టి రాజమణి(75) కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. రాజమణి మృతి పట్ల మంత్రి ప్రగాఢ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. రాజమణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కేంద్ర హోంమంత్రి బండి సంజయ్‌తో పాటు దేవిశెట్టి రాజమౌళి, ఐ అండ్ పీఆర్ శాఖ జాయింట్ డైరెక్టర్ దేవిశెట్టి శ్రీనివాస్, ఆంజనేయులు, హన్మండ్లు, జయంత్ కుమార్, దేవిశెట్టి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement