తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని , జీవో 317 సవరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన జాగరణ దీక్ష సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జైలు నుండి విడుదలైన బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీకాంత్ నాయక్ ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. శ్రీకాంత్ నాయక్ ఇంటికి వెళ్లి మనోధైర్యం కల్పించారు. జీవో 317 రద్దు కోసం జరిగిన ధర్మ పోరాటంలో భాగంగా దీక్ష సమయంలో తనతోపాటు బీజేపీ శ్రేణులను కెసిఆర్ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు తరలించిందని బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల్లో న్యాయం జరగాలని దీక్షలో తనతోపాటు జైలుకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, బిజెపి నాయకుల పోరాట స్ఫూర్తి మరువలేనిదన్నారు. తాను మీ కుటుంబంలోని ఒక సభ్యుని, మీలో ఒకడిని, అండగా ఉంటానని, అధైర్య పడవద్దని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఎంపీ బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ఉద్యోగుల కోసం చేసిన పోరాటం వృధా కాదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి త్వరలో విజయం సాధిస్తామని బండి ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement