Saturday, November 23, 2024

16నుంచి జ‌నంలోకి బండి సంజ‌య్..

జనవరి 16 నుంచి నియోజక వర్గాల్లో బండి సంజయ్ పర్యటన
ప్రతి రోజూ మూడు బూత్‌స్థాయి సమావేశాలు
ఇప్పటికే బూత్‌స్థాయి కార్యకర్తలతో జేపీ నడ్డా వర్చువల్‌ మీటింగ్‌
ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు
సంస్థాగత బలోపేతంతోపాటు ప్రజల్లోకి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు
విజయం సాధించాలంటే బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతం ముఖ్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అసెంబ్లి ఎన్నికలు సమీపిస్తుండడం, ఆరు నెలల్లోగా ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చన్న పరిస్థితుల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై తెలంగాణ బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని బూతుల్లో పార్టీ కమిటీలను యాక్టివేట్‌ చేస్తోంది. రాష్ట్ర అసెంబ్లికి ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చనుకుంటున్న బీజేపీ అందుకు తగ్గట్టుగానే ప్రిపేర్‌ అవుతోంది. నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతంపై ఫోకస్‌ పెట్టింది.
సంక్రాంతి పండగ తర్వాత ప్రతి నియోజకవర్గంలో పర్యటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్య టించనున్నారు. జనవరి 16 నుంచి ప్రతి రోజూ మూడు నియో జకవర్గాల్లో రాష్ట్ర అగ్రనాయకత్వం పర్యటించనుంది. బూత్‌స్తాయి నుంచి సంస్తాగతంగా పార్టీని బలోపేతం చేయటంపై దృష్టి సారించనున్నారు.

రానున్న అసెంబ్లి ఎన్నికల్లో విజయం సాధించా లంటే బూత్‌ స్థాయిలో పార్టీ బలోపేతం ముఖ్యమని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందంటే ఆ విజయాల వెనక బూత్‌స్థాయి కమిటీల కృషి ఎంతో ఉందని బీజేపీ జాతీయ నేతలు రాష్ట్ర నేతలకు సూచిస్తున్నారు. తెలంగాణలో దాదాపు 34, 600 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 300కు బూత్‌లు ఉన్నాయి. ఒక్కో బూత్‌లో 21మందితో కమిటీలు ఉన్నాయి. బండి సంజయ్‌ జిల్లాల పర్యటనకు ముందు గానే ఈ నెల 7న బూత్‌స్థాయి కమిటీలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా వర్చువల్‌గా సమావేశమయ్యారు. 119 నియోజ కవర్గాల్లో 7, 26, 660 మంది బీజేపీ కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా వర్చువల్‌గా సమావేశం అయ్యారంటే బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి బీజేపీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. పర్యటనలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో బూత్‌స్తాయి సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement