Tuesday, November 26, 2024

ఒక్కరు చాలు.. ఇద్దరు వద్దు: జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తామన్న బండి సంజ‌య్‌

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఓ కొత్త నినాదాన్ని వినిపిస్తున్నారు. ‘ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు ఇదే మా నినాదం’ అని బండి సంజ‌య్ చెప్పారు. ఈ నినాదంతోనే తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో ‘2023లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌ మాదిరిగా తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తాం. ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు ఇదే మా నినాదం’ అని బండి సంజ‌య్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయ‌న ఈ రోజు పోస్ట్ చేశారు. ‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించడానికి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నా, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తూ కేసీఆర్ చట్టం తీసుకురావాలని చూశారు. బీజేపీ అడ్డుకోవడంతో భయపడి వెనక్కు తగ్గారు. దమ్ముంటే బిల్లు పెట్టి చూడు. ఎక్కడ అడ్డుకోవాలో, అక్కడ అడ్డుకుని తీరుతాం’ అని బండి సంజ‌య్ హెచ్చ‌రించారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement