Friday, November 22, 2024

టీఆర్ఎస్‌తో పొత్తుపై బండి సంజయ్ క్లారిటీ

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బొక్కాబోర్లా పడింది. దీంతో బీజేపీ డిఫెన్స్‌లో పడిన మాట ముమ్మాటికీ వాస్తవం. సాగర్ ఉపఎన్నికలో గెలిచి మళ్లీ సత్తా చాటాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. కానీ ఈ మధ్యలో టీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని పొలిటికల్ వర్గాల్లో వార్తలు వచ్చాయి. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని వారు ఆరోపించారు. అయితే ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోదీ ప్రభుత్వ తీరుపై బీజేపీయేతర సీఎంలు, కీలక నేతలకు లేఖలు రాయగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. మమతా లేఖల అంశం టీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై మరింత బలాన్ని చేకూర్చింది.

ఈ నేపథ్యంలో వచ్చిన వార్తలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌లు ఏవైనా త‌మ‌కు ఎవ‌రితోనూ పొత్తు లేద‌ని, టీఆర్ఎస్‌తో పొత్తుపెట్టుకునే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. అవ‌న్నీ పుకార్లేన‌ని కొట్టిపారేశారు. తెలంగాణలో మూర్ఖత్వపు పాలన సాగుతోందని, రాష్ట్రంలో టీఆర్ఎస్ అరాచకాలు సృష్టిస్తోందని, ఆ పార్టీ ఇంకా ఎంతోకాలం అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు. సంఘ విద్రోహ శక్తులకు టీఆర్ఎస్ పార్టీ వత్తాసు పలుకుతోందని బండి సంజయ్ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement