ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు మోడీ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గా అవకాశం దక్కింది. బండి సంజయ్ కు మంత్రి పదవి దక్కడతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.
గతంలో కరీంనగర్ ఎంపీగా పని చేసిన విద్యా సాగర్ రావు కూడా కేంద్ర హోమ్ సహాయ మంత్రి గా పని చేశారు. తిరిగి అదే పునరాగతం అయింది. సంజయ్ కు హోం శాఖ సహాయ పదవి దక్కడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో తేలియడారు.