Monday, September 30, 2024

జైలు నుంచి బండి సంజయ్ విడుదల

కరీంనగర్ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం ఉదయం 9.08 గంటల తర్వాత కరీంనగర్ జైలు నుండి బెయిల్ పై విడుదలయ్యారు. బండి సంజయ్ కు సంఘీభావం తెలిపేందుకు భారీ ఎత్తున కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు కరీంనగర్ కు తరలి వచ్చారు. జైయిల్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ ఐదించి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి – బండి

టి ఎస్ పి ఎస్ సి ప్రశ్నపత్రాల లీకేజీ 0వై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని, కె టి ఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తి నాపై కుట్ర పన్నారు ఆని బండి సంజయ్ అన్నారు..జైలు నుంచి విడుదల అనంతరం మీడియా తో మాట్లాడుతూ, ఆ ఇష్యూ ను డై వర్ట్ చేయడానికి కుట్రదారులు కె సి ఆర్,, కె టి ఆర్ లు పది లీకేజీ డ్రామా అడుతున్నారన్నార న్నారు. దమ్ముంటే 10 పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. టి పి పి ఎస్ సి లీకేజీ పై ఇదివరకే తాము చేసిన డిమాండ్ లతో తెలంగాణా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అన్నారు. మా అత్తమ్మ చనిపోయి ఇంట్లో ఏడుస్తున్న సమయంలో పోలీసులు అతిగా ప్రవర్తించారు మా అత్తమ్మ నన్ను కన్న కొడుకుల చూసుకునేది, ఎంపీ అని చూడకుండా పోలి సులు వ్యవహరించిన తీరు భాద కలిగించింది అని అన్నారు.

- Advertisement -

ప్రశ్నిస్తే పిచ్చి అంటున్నారనీ,. వరంగల్ గడ్డపై భారీ ప్రదర్శన నిర్వహిస్తామని బండి పేర్కొన్నారు. టీ ఎస్ పి ఎస్ సి ఇష్యూ నీ డై వర్టు చేస్తున్నారనీ, దమ్ముంటే చర్చకు రావాలని బండి డిమాండ్ చేశారు. కె సి ఆర్ కొడుకు, బిడ్డ జైలు కు పోవడం ఖాయమని జ్యోస్యం చెప్పారు. కెసిఆర్, కేటీఆర్ ల వెంటపడుతా అంటూ ఘాటు విమర్శలు చేసారు బండి సంజయ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement