పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడమే తమ ముందున ప్రథమ కర్తవ్యం. అందుకు 15ఏళ్ల నాటి ప్రభుత్వ వాహనాలను రద్దు చేస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించింది. దీనికి సంబంధించిన స్క్రాపేజ్ పాలసీని అన్ని రాష్ట్రాలకు పంపించినట్లు ఆయన తెలిపారు. హర్యానాలో కొత్త రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్‌వీఎస్‌ఎఫ్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించారు.
రోడ్లపై తిరిగే 15ఏళ్ల నాటి వాహనాలను స్క్రాప్ చేయాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు చెప్పామని వివరించారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ ఏడాది ఆరంభంలో వాహనాల స్క్రాపేజ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గడ్కరీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణంలో పాత టైర్లు వంటి ముడిసరుకులను ఉపయోగించనున్నట్లు తెలిపారు.