మాస్కో: లింగమార్పిడి విధానాన్ని రష్యా ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు రష్యా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుపై అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ సంతకం చేశారు. ఈ బిల్లును ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఉద్దేశపూర్వకంగా లింగ మార్పిడికి సిద్ధమైన వారికి ఎలాంటి వైద్య చికిత్స అందించకూడదని చట్టం పేర్కొంది. పబ్లిక్ రికార్డుల్లో, అధికారిక పత్రాల్లో జెండర్‌ను మార్చడానికి వీలు లేకుండా దీన్ని రూపొందించారు. అయితే, పుట్టుకతో లింగపరమైన సమస్యలున్న వారికి ఈ చట్టం వర్తించదు. వారికి వైద్య సహాయం అందించవచ్చని పేర్కొంది. గతంలో లింగమార్పిడి చేయించుకున్న అనంతరం జరిగిన పెళ్లిళ్లను రద్దు చేసింది. అంతేకాకుండా వీరు పిల్లల్ని దత్తత తీసుకోవడాన్ని కూడా ఈ చట్టం నిషేధించింది. ఈ చట్టం దేశంలో కుటుంబ విలువలను పెంచుతుందని, ఎల్‌జిటీ కమ్యూనిటీ పెరగకుండా అరికడుతుందని కొందరు అభివర్ణించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement