Thursday, November 7, 2024

బెట్టింగ్‌, లోన్‌ యాప్‌లపై కొరడా

దేశంలో అడ్డగోలుగా పుట్టుకొస్తున్న లోన్‌ యాప్‌లు, బెట్టింగ్‌ యాప్‌లపై కేంద్రం నిషేధించింది. రుణ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్న సామాన్య, మధ్య తరగతి వారిని తీవ్రంగా వేధిస్తున్నాయి. వీరి ఒత్తిడికి తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ యాప్‌లపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వెంటపడి రుణాలు ఇస్తున్న ఈ యాప్‌ల నిర్వహకులు విపరీతమైన వడ్డీలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు.

ప్రజల నుంచి ఈ తరహా యాప్‌లపై వచ్చిన ఫిర్యాదులను కేంద్రం పరిగణలోకి తీసుకుంది. చైనాతో సంబంధం ఉన్న 138 బెట్టింగ్‌ యాప్‌లు, 94 రుణ చెల్లింపుల యాప్‌లను అత్యవసర ప్రాతిపదికన నిషేధించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖకు హోం శాఖ ఈ వారంలో ఆదేశబుూలు జారీ చేసినట్లు సమాచారం. ఈ యాప్‌లను బ్లాక్‌ చేసే ప్రక్రియను ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ ప్రారంభించింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69 ప్రకారం ఈ యాప్‌లు దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగించేలా ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన తరువాత ఈ చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -

చైనాకు చెందిన యాప్‌ నిర్వహకులు భారతీయులనే డైరెక్టర్లుగా నియమించుకుని వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. రుణ యాప్‌ల నిర్వహకులను గతంలో చాలా సార్లు ఆర్బీఐ హెచ్చరించింది. ఇందుకు మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. అయినప్పటికీ కొన్ని లోన్‌ యాప్‌ల నిర్వహకులు తమ వేధింపులను ఆపలేదు. వీటి ఆగడాలు మితిమీరడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

ఇలా రుణాలు తీసుకుని మొత్తం చెల్లించినా.. ఇంకా చెల్లించాలని ఒత్తిడి చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వీరి ఆగడాలు బయట ప్రపంచానికి తెలిశాయి. చాలా రాష్ట్రాల్లో ఈ యాప్‌ల ద్వారా భారీగా బిజినెస్‌ చేస్తున్నాయి. ఆరు నెలల క్రితమే 28 చైనా లోన్‌ చెల్లింపు యాప్‌ను కేంద్రం విశ్లేషించింది. 94 యాప్‌లు ఈ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని థర్డ్‌ పార్టీ లింక్‌ల ద్వారా పని చేస్తున్నట్లు గుర్తించారు.

బెట్టింగ్‌ యాప్‌ల ద్వారా కూడా చాలా మంది దారుణంగా నష్టపోతున్నారు. ఇదో వెసనంలా మారి డబ్బులు పొగొట్టుకుంటున్నారు. రకరకాల స్కీమ్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తున్న ఈ యాప్‌లు బెట్టింగ్‌లు పె ట్టేలా చేసి దోపిడి చేస్తున్నాయి. వీటి ఆగడాలకు కూడా కేంద్రం అడ్డుకునేందుకు నిషేధం విధించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement