ప్రభ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: ఆన్లైన్ రమ్మీ, తీన్ పత్తా, క్రికెట్ తదితర ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించే సంస్థల ప్రకటనలకు మెట్రోలో నిషేధించారు. ప్రజల బలహీనతలతో ఆటలాడుకునే సంస్థల ఆడ్స్ సమాజానికి ప్రమాదమని, ఇందుకు సంబందించి అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే అన్ని మెట్రోలకు సూచనలు చేసింది. మై జాక్ పాట్, బెట్‌వే, వోల్ఫ్77, పారి మ్యాచ్, వన్ ఇంటూ బెట్, తదితర సంస్థలు అక్రమ కార్యాకలాపాలకు పాల్ప డుతున్నందున వాటిని ఇప్పటికే నిషేధించామని, వాటి ప్రకటనలను వెం టనే ఆపేయాలని కేం ద్రం అన్ని మెట్రోలకు తాఖీదులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ మెట్రో ఆడ్స్ హక్కులు పొందిన సంస్థలు కేంద్రం సూచలను పాటించాలని హెచ్ఎం ఆర్ఎల్ సూచించింది. ఇందుకు సంబంధించి యాడ్ ఏజెన్సీలకు మెట్రో యాజమాన్యం మార్గదర్శకాలు జారీ చేసింది.
తప్పుడు సంకేతాలు..
నిషేదిత సంస్థల ఆడ్స్‌ను పబ్లిష్ చేస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉంది. దేశంలో అనేక ఆన్ లైన్ బెట్టింగ్ సంస్థల వల్ల ప్రజలు నిత్యం కోట్లాది రూపాయలు నష్ట పోతున్నారు. హైదరాబాద్ మెట్రోలో ఉన్న రైలు సర్వీసులతో పాటు 57 రైల్వే స్టేషన్లలో నిషేదిత ఆన్లైన్ బెట్టింగ్ సంస్థలు ప్రకటనలు జారీ చేస్తున్నాయి. అయితే కేంద్రం సూచనల మేరకు వీటిని ఇక నుంచి అనుమతించరు. ఫలితంగా ఆడ్ ఏజెన్సీలు కొంత మేర నష్టపోయిన ప్పటికి నిషేదాజ్ఞలు పాటించాల్సిందేనని మెట్రో వర్గాలు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఆడ్స్ వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
ప్రజల హర్షం..
నిషేదిత ఆన్లైన్ బెట్టింగ్ సంస్థల ప్రకటనలను మెట్రో లాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు నిషేదించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బెట్టింగ్ గేమ్‌ల మత్తులో పడి యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా నష్ట పోతున్నారని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కొంత మంది వీటి మత్తులో పడి సర్వస్వసం కోల్పోతున్నారు. బెట్టింగ్ గేమ్‌లకు బానిసలై ఆత్మహత్యలకు పాల్పడుతన్న సంఘటనలు కూడా అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా వీటి పట్ల సర్కార్ కొరడా ఝలిపించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.