Saturday, November 23, 2024

మళ్లీ తెరపైకి 2018 బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం.. విచారణకు సిద్ధమైన సీఏ

క్రికెట్‌లో పెను దుమారానికి కారణమైన 2018 బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంపై ఆ ఘటన ప్రధాన సూత్రధారి ఆస్ట్రేలియా క్రికెటర్‌ కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్‌ బంతికి స్యాండ్‌ పేపర్‌ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా… బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు… స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది.

అయితే ఈ వివాదం కారణంగా బాన్ క్రాఫ్ట్, స్మిత్, వార్నర్లు కొంత కాలం నిషేదాన్ని ఎదుర్కొన్నారు. వివాదం అంతా సద్దుమణిగి అందరూ వారి వారి కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ఇంతలోనే బాన్ క్రాఫ్ట్ మరో బాంబు పేల్చాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాన్‌క్రాఫ్ట్‌ 2018 నాటి బాల్ టాంపరింగ్ వివాదానికి సంబంధించి ఆశక్తికర విషయాలు తెలియజేశాడు. తాను ఉద్దేశపూర్వకంగా బాల్‌ ట్యాంపరింగ్‌ కు ప్రయత్నిస్తున్నాననే విషయం అప్పటి సారథి స్మిత్, వార్నర్‌లతోపాటు ఇతర బౌలర్లకు కూడా తెలుసు. ఎందుకంటే నేను చేసే పని వల్ల వారికే లాభం ఎక్కువగా ఉంటుంది. జట్టులో గుర్తింపు తెచ్చుకోవడం కోసం నేను ట్యాంపరింగ్‌కు పూనుకున్నాను. ఆ సమయంలో నైతిక విలువలను నేను పూర్తిగా మరిచిపోయాను. ఆ తర్వాతే నాకు తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశానో’ అని అన్నాడు.

అయితే బాల్‌ ట్యాంపరింగ్‌పై బాన్‌క్రాఫ్ట్‌ చేసిన తాజా వ్యాఖ్యలపై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) సీరియస్ గా తీసుకుని విచారణకు సిద్ధమైంది. బాన్‌క్రాఫ్ట్‌ చెప్పినట్లు ఇతర బౌలర్లకు కూడా ఈ విషయం ముందుగానే తెలుసా అనే కోణంలో విచారణ ఉంటుందని సీఏ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement