గ్రేటర్ వరంగల్ కి కొత్త వాగ్ధానం పేరుతో నగరాన్ని అత్యంత స్వచ్ఛ నగరంగా మార్చడానికి బల్దియా ఛాలెంజ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య నేడోక ప్రకటనలో తెలిపారు. నగరం లో సానిటేషన్ మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి నగర ప్రజల నుండి ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఇందులో నగరవాసులు, ఆర్ డబ్లు ఎ ఎస్, ఎన్ జి ఓ ,విద్యా సంస్థలు, స్టార్టప్‌లు వినూత్న పరిష్కారాలు, జోక్యాలను సూచించవచ్చు.ఈ పోటీల్లో భాగంగా సాలిడ్ , లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, రియల్ టైమ్ మానిటరింగ్, ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి మొబైల్ అప్లికేషన్, వెబ్ ప్లాట్‌ఫాం తదితర అంశాలను వివరించాలి.
వరంగల్‌ను క్లీన్ సిటీగా మార్చేందుకు సోషల్ క్లీనర్ల కోసం ఆవిష్కరణలను థీమ్‌లుగా చేర్చడం, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ అండ్ రీసైక్లింగ్‌లో భాగంగా జీరో డంప్‌గా మార్చడం, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు, పారదర్శక పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, అంశాలపై ప్రతిపాదనలు సమర్పించాలి. ఉత్తమ ప్రతిపాదనలకు ప్రథమ బహుమతి రూ. 15,000, రెండవ బహుమతి రూ. 10,000 , మూడవ బహుమతి రూ. 5,000, ప్రతిపాదనలు / ఎంట్రీలను 31 డిసెంబర్ 2021 సాయంత్రం 5 గంటలలోపు మెయిల్ ఐడి: [email protected]కి సమర్పించాలి. 9704116215 మొబైల్ నంబర్‌లో సంప్రదించడం ద్వారా మరిన్ని వివరాలను పొందవచ్చని కమిషనర్ వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..