Tuesday, November 26, 2024

ప్రభాస్ కి.. రామ్ చరణ్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య

అన్ స్టాపబుల్ షోకి హాజరయ్యాడు స్టార్ హీరో ప్రభాస్.. అయితే ప్రభాస్ అంటే ఫ్యాన్స్ లో మొదట వినిపించే ప్రశ్న పెళ్లి ఎప్పుడు అని.. ఈ ప్రశ్నని హీరో బాలయ్య.. ప్రభాస్ ని అడిగాడు. దీని గురించి ఇద్దరి మధ్య ఫన్నీగా సంభాషణ జరిగినట్లు ఉంది. ప్రోమోలో బాలయ్య మాట్లాడుతూ.. నువ్వు డార్లింగ్ అంటే దెయ్యాలు కూడా దేవతలుగా మారిపోతాయి, నేను కూడా నీ మాయలో పడిపోయా అని బాలయ్య అన్నారు. అసలు పెళ్లి సంగతి ఏంటి ? ఉందా లేదా ? అని బాలయ్య ప్రశ్నించారు. నాకు ఇంకా రాసి పెట్టినట్లు లేదు సర్ అని ప్రభాస్ ఫన్నీగా బదులిచ్చాడు.

దీనితో బాలయ్య..ఒరేయ్ మీ అమ్మకు చెప్పిన మాటలు నా దగ్గర చెప్పకు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతలో బాలయ్యతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోన్ లో మాట్లాడతాడు. బాలయ్య.. రాంచరణ్ కి కూడా చిన్న వార్నింగ్ ఇచ్చాడు. సంక్రాంతికి ఫస్ట్ నా సినిమా చూడు.. ఆ తర్వాత మీ నాన్న సినిమా చూడు అని చెప్పడంతో రాంచరణ్ పగలబడి నవ్వేశాడు. సంక్రాంతికి కానుకగా బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు బడా హీరోలు.. అది కూడా బాలయ్య, చిరంజీవి లాంటి స్టార్లు బాక్సాఫీస్ వద్ద తలపడుతుండడంతో ఇండస్ట్రీలో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారు తమ హీరో చిత్రమే విజయం సాధిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement