Friday, November 22, 2024

Balasore Tragedy – విద్యుత్ షాక్ తో 40 మంది మృత్యువాత‌..

ఒడిశా లోని బాలాసోర్ లో శుక్రవారం జరిగిన ఘోర రైళ్ల‌ ప్రమాదం యావత్తు ప్రపంచానికి దిగ్ర్భాంతి క‌లిగించింది.. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 288 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 1000 మందికి పైనే గాయాప‌డ్డారు. మ‌ర‌ణించిన వారిలో 101 మంది ప్ర‌యాణీకుల వివ‌రాలు ఇప్ప‌టి వ‌ర‌కు తెలీయ‌రాలేదు.. వారి మృత‌దేహాల‌ను క‌ట‌క్ లోని ప్ర‌భుత్వ‌మార్చురీలో భ‌ద్ర‌ప‌రిచారు.. వారి ఫోటోల‌ను రైల్వే శాఖ ఇప్ప‌టికే విడుద‌ల చేసింది..

ఇది ఇలా ఉంటే , మృతుల్లో కనీసం 40 మంది విద్యుత్‌ షాక్‌ వల్లే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ప్రమాదం తర్వాత ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది.. పట్టాలు తప్పిన బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీశారు. అందులో కనీసం 40 మృతదేహాల శరీరాలపై ఎలాంటి గాయాలైన ఆనవాళ్లూ కనిపించలేదని పోలీసు అధికారి తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు కూడా తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మూడు రైళ్లు ఢీ కొన్న ఘటనలో ఓవర్‌హెడ్‌ కేబుల్‌ తెగి బోగీలపై పడి విద్యుత్‌ షాక్‌ జరిగి ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారంతా విగ‌త‌జీవులైన‌ట్లు భావిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement