- డిప్యూటేషన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం
- ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు
సింగరేణి బొగ్గు గనుల సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బలరాం నాయక్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పూర్తి అదనపు బాధ్యతల్లో చైర్మన్ అండ్ ఎండీగా డైరక్టర్ ఫైనాన్స్ కూడా విధులు నిర్వహిస్తున్నారు.
ఐఆర్‌ఎస్ అధికారి అయిన బలరాం నాయక్ డిప్యూటేషన్‌ను మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ ప్రాంతానికి చెందిన బలరాం నాయక్ గత ఐదేళ్లుగా సింగరేణి సంస్థలో చేసిన సేవలు, చూపిన ప్రతిభ, కనబరిచిన పురోగతి దృష్ట్యా ఆయన్ను పూర్తి స్థాయిలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా నియమించనున్నట్టు సమాచారం.