హీరో బాలకృష్ణ చిన్న కూతురు , అల్లుడు ఇద్దరూ కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబో బ్లాక్ బస్టర్ హిట్ కాంబో కాగా.. ఈ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మరో సినిమా 14 రీల్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. బాలయ్య చిన్నల్లుడు భరత్ ఈ సినిమాలో 20% పెట్టుబడి పెట్టి లాభాల్లో వాటా తీసుకోనున్నారని సమాచారం. మరొకవైపు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా త్వరలో సినిమాలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఆదిత్య 369 సీక్వెల్ ద్వారా ఆయన రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో ఈ సినిమా ఇప్పటికే పలు వార్తలు అయ్యాయి. ఈ సినిమాకి కూడా బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. ఇకపోతే నందమూరి కుటుంబంలో ఇప్పటికే 11 బ్యానర్లు ఉండగా.. రాబోయే రోజుల్లో ఈ బ్యానర్ల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్త వైరల్ అవుతోంది.