Thursday, November 21, 2024

మృతులకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాల్సిందే !! బాలకృష్ణ

అనంతపురం జిల్లా హిందూపురం లోని  ప్రభుత్వ ఆసుపత్రిలో  ఆక్సిజన్  సరఫరా సమస్య తలెత్తడం,  మరోవైపు ఆసుపత్రిలో 8 మంది కరోనా  పేషెంట్స్  మృతిచెందడం,  బంధువుల ఆందోళన చేయడం పై  సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ   స్పందించారు.  మృతి చెందిన కోవెడ్  బాధిత బంధువులకు  25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముందు జాగ్రత్త లేకపోవడం, సరైన మానిటరింగ్ చేయలేకపోవడం, అధికారుల మధ్య సమన్వయ  లోపించడం వల్లనే  ఈ రోజు చాలామంది వైద్యం తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకున్నారని  ఆయన అన్నారు.

  కొవిడ్ ఆసుపత్రులలో  సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని  అందుకే రాష్ట్రంలో చావు కేకలు వినిపిస్తున్నాయని బాలయ్య అన్నారు. ప్రజల్లో అభద్రతా భావం  పెరిగిందని,  ఇప్పటికైనా  ప్రభుత్వం కళ్లు తెరచి సరైన వైద్యం సౌకర్యాలను  అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసుపత్రికి వచ్చే కోవెడ్  బాధితులకు నాణ్యమైన వైద్యం అందించాలని  కోరారు.  నియోజకవర్గ ప్రజలు  తగు జాగ్రత్తలు తీసుకొని కోవెడ్  నుంచి బయటపడాలని సందేశాన్ని ఇచ్చారు.  ఈ సందేశాన్ని వీడియో రూపంలో  మీడియాకు పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement