ఆహా ఓటీటీ కోసం నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా బుల్లితెరపై మెరిసి సందడి చేస్తున్నారు. అన్ స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్నారు. మరోపక్క చిత్రాలతో కూడా బిజీగా ఉన్నారు. ఇక బాలకృష్ణ నటించే 107వ సినిమా కూడా ప్రారంభంకానుంది. ఈ మేరకు పూజా కార్యక్రమాలు జరిగాయి. బాలయ్యకి జోడీగా హీరోయిన్ శృతిహాసన్ నటిస్తోంది. దర్శకులు బోయపాటి శ్రీను, వీవీ వినాయక్, కొరటాల శివ, హరీష్ శంకర్, బాబీ, బుచ్చిబాబు తదితరులు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. బాలయ్య, శృతిహాసన్ లపై వీవీ వినాయక్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి షాట్ కు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. బాబి, కొరటాల శివ, బుచ్చిబాబులు ఈ చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్ కు స్క్రిప్ట్ అందజేశారు. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం. ఓ పాత్రలో ఫ్యాక్షనిస్టుగా, మరో పాత్రలో స్వామీజీగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
లోకల్ టు గ్లోబల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily