దర్శకుడిగా మారిన హాస్యనటుడు వేణు యెల్దండి డైరెక్ట్ చేసిన సినిమా బలం. థియేట్రికల్ రిలీజ్ సమయంలో తెలంగాణాలో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది ఈ మూవీ. ఎందుకంటే ఈ సినిమా తెలంగాణ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. అయితే ఇతర ప్రాంతాలలో ఈ సినిమా నైజాంతో పోలిస్తే తక్కువ పనితీరును కనబరిచింది. సినిమా కంటెంట్ అన్ని ఏరియాల ప్రేక్షకులను మెప్పించలేక పోయిందని కొందరు కామెంట్ చేశారు.
అయితే, రీసెంట్ గా OTTలో రిలీజ్ అయిన బలగం. ఆ వ్యాఖ్యలన్నీ తప్పు అని కొట్టిపడేసింది. చాలా మంది నెటిజన్లు సినిమాపై సోషల్ మీడియాలో ఎమోషనల్ రియాక్షన్స్ ను పంచుకుంటున్నారు. దీంతో ఈ సినిమా ప్రతీ తెలుగు ప్రజల హృదయాన్ని గెలుచుకుంటుంది అని అర్థం అవుతుంది. ప్రపంచంలోని ప్రతీ తెలుగు ప్రేక్షకుల నుండి బలగం టీమ్ భారీ ప్రశంసలను అందుకుంటుంది. ముఖ్యంగా, దర్శకుడు వేణు యెల్దండి చూపిన ప్రతిభకు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా, అతను అలాంటి బలమైన, మంచి ఎమోషన్స్ కలిగి ఉన్న సినిమాని ఇండస్ట్రీకి అంధించాడు. సంస్కృతి, సంప్రదాయాలు ఒక ప్రదేశానికి మరొక ప్రాంతానికి భిన్నంగా ఉండవచ్చు, కానీ భావోద్వేగాలు ఒకేలా ఉంటాయని బలగం సినిమా నిరూపించింది.
ప్రియదర్శి, కావ్య, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, కేతిరి సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన బలగం చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలోని ఇతర తారాగణంలో కొమ్ము సుజాత, అరుసం మధుసూధన్, ఆస్ని మనస్విని గౌడ్ తదితరులు ఉన్నారు. ఈ సినిమాకి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించగా, సినిమాటోగ్రఫీని ఆచార్య వేణు నిర్వహించారు.