బజాజ్ ఆటో ఈవీ స్కూటర్ చేతక్ అమ్మకాలు భారీగా పెంచుకోవాలని నిర్ణయించింది. చేతక్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని భావిస్తోంది. జూన్ నాటికి ఉత్పత్తిని 10 వేల యూనిట్లు పెంచాలని నిర్ణయించుకుంది. అమ్మకాలు పెంచుకునేందుకు సేల్స్ నెట్‌వర్క్‌ను భారీగా పెంచ నుంది. సెప్టెంబర్ నాటికి 150 ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లను ప్రారంభించాలని బజాజ్ కంపెనీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రాకేష్ శర్మ తెలిపారు.
ప్రస్తుతం బజాజ్ ఉత్పత్తి సామర్ధ్యం 5 వేలుగా ఉన్నాయి. వీటిని 7 వేలకు పెంచుతామని, జూన్ నాటికి ఉత్పత్తి సామర్ధ్యాన్ని 10వేలకు పెంచుతామని రాకేష్ శర్మ తెలిపారు. విడిభాగాల సర ఫరాలో ఇబ్బందుల మూలంగా ఉత్పత్తిపై ప్రభావం చూపిందని చెప్పారు. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించామని, ఇక ఉత్పత్తి పెంచడంపై పూర్తి దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం చేతక్ ఈవీ స్కూటర్ వెయిటింగ్ పీరియడ్ 20-25 రోజులుగా ఉంది. మే నెల నుంచి ఈ సమయం 3-5 రోజులకు తగ్గుతుందని రాకేష్ శర్మ చెప్పారు. ప్రస్తుతం బజాజ్ చేతక్ ఈవీ షోరూమ్‌లు 88 పట్టణాల్లో 105 వరకు ఉన్నాయని చెప్పారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి 120 పట్టణాల్లో 150 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లకు పెంచాలని కంపెనీ నిర్ణయించిందన్నారు.
2024 మార్చి తరువాత ఫేమ్-2 సబ్సిడీ కొనసాగిస్తారా లేదా అనే అంశంపై ఆధారపడి తదుపరి విస్తరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫేమ్-2 సబ్సిడీని ఎత్తివేస్తే ఈవీ వాహనాల ధరలు భారీగా పెరుగుతాయని, దీని వల్ల అమ్మకాలు నెమ్మదిం చే అవకాశం ఉందన్నారు. దీని ఆధారంగానే చేతక్ స్టోర్లను విస్తరిస్తామన్నారు.