Tuesday, November 26, 2024

ఆర్థిక విద్య కార్యక్రమాన్నిప్రారంభించిన బజాజ్‌ ఫైనాన్స్‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ లిమిటెడ్‌ రుణ విభాగం, ఆర్థిక సేవలు అందించడంలో అగ్రగామిగా ఉన్న బజాజ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ తన ప్రజా అవగాహన కార్యక్రమం ప్రతి సారీ సకాలంలో ఈఎంఐ ని ప్రారంభించింది. ఇది ఆరోగ్యదాయక ఆర్థిక భవిష్యత్‌ కోసం చక్కటి ఆర్థిక అలవాట్లను అనుసరించాల్సిన అవసరముంది. దానివల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచేందుకు చేపట్టిన డిజిటల్‌ కార్యక్రమం. తమ రుణాలకు సంబంధించి నెలవారీ ఈఎంఐలను సకాలంలో చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలు, రుణాల చెల్లింపులలు చేయకపోతే అది దీర్ఘకాలంలో వారి ఆర్థిక ఆరోగ్యంపై కనబరిచే ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనేది ఈ క్యాంపెయిన్‌ ఉద్దేశమని ఆ సంస్థ తెలిపింది.

మార్కెట్లో లభ్యమయ్యే వివిధ ఆర్థిక సేవల ప్ర యోజనాలను ఆనందించేందుకు చెల్లింపుల కట్టు బాట్లను పాటించేందుకు గాను క్రమశిక్షణను అలవర్చుకో వడం ఆవశ్యకతపై ఈ క్యాంపెయిన్‌ ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఈ బ్రాండ్‌ క్యాంపెయిన్‌ గుప్తాజీ చేసే అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి అనే బోధనను చాటిచెబుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement