బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్త మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని విడుదల చేసింది. పే యాజ్ యూ కన్జూమ్ (పీఏవైసీ) పేరుతో కొత్త యాడ్ ఆన్ పాలసీ తీసుకు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఐఆర్‌డిఏ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ తీసుకు వచ్చిన ఈ యాడ్ ఆన్ కవర్ పాలసీ పట్ల వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపింది. కస్టమర్లు తమ వాహనం వినియోగిస్తున్న దానికి అనుగుణంగా ఈ పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. దీని ఆధారంగా ప్రీమియం లెక్కిస్తారు. టెలిమ్యాట్రిక్స్ డివైజ్ ద్వారా కస్టమర్ల ఎలా డ్రైవ్ చేస్తున్నదాన్ని విశ్లేషిస్తారు.
దీని వల్ల అదనపు ప్రయోజనం పొందవచ్చని కంపెనీ ఎండీ, సీఈవో తపన్ సైగల్ తెలిపారు. మార్కెట్లో పీఏవైసీ పాలసీని తీసుకు వచ్చిన మొదటి కంపెనీ తమదేనని ఆయన చెప్పారు. కస్టమర్లు తమ వాహనం వినియోగాన్ని పాలసీ ఎంపిక చేసుకునే వెసులుబాటు వల్ల అదనపు ప్రయోజనాలు పొందుతారని ఆయన వివరించారు. కొత్త పాలసీలను అందించడంలో కంపెనీ ఎప్పుడూ ముందుంటుందని ఆయన చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.