Tuesday, October 22, 2024

Phone tapping case | బెయిల్ తిరస్కరణ..

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆరుగురి పేర్లను నిందితులుగా చేర్చారు. కాగా, తమకు బెయిల్ మంజూరు చేయాలని భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా, నాంపల్లి కోర్టు తిరస్కరించింది.

అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఈరోజు విచారించిన కోర్టు… వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేసినందున ఇంకా విచారించాల్సి ఉందని నిందితులకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టును కోరారు. బెయిల్‌ పిటిషన్లపై మంగళవారమే వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement