Wednesday, November 20, 2024

ఐపీవోకి బైజుస్‌ కసరత్తు.. జనవరిలో ప్రకటనకు అవకాశం

భారత్‌లో అత్యధిక వ్యాల్యూయేషన్‌ కలిగిన స్టార్టప్‌, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ప్రొవైడర్‌ బైజుస్‌ ఐపీవోకి సమాయత్తమవుతోంది. కొనుగోలు చేసిన కంపెనీల్లో ఒక ప్రత్యేక కంపెనీ, బ్లాంక్‌ చెక్‌ కంపెనీగా పిలిచే చర్చిల్‌ క్యాపిటల్‌ విలీనం తర్వాత ఐపీవోగా రావాలనే అంశంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పలువురు స్పాక్‌ పార్టనర్లతో బైజుస్‌ చర్చలు జరిపింది. మైకెల్‌ క్లెయిన్స్‌కు చెందిన చర్చిల్‌ క్యాపిటల్‌తో ఒప్పందంపై కసరత్తు చేస్తోందని ఆయా వర్గాలు వివరించాయి. చర్చిల్‌ క్యాపిటల్‌ ఫిబ్రవరిలో 6 1.3 బిలియన్‌ డాలర్లకుపైగా నిధులు సేకరించింది.

ప్రస్తుతం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజీలపై ట్రేడ్‌ అవుతోంది. బైజుస్‌ 4 బిలియన్‌ డాలర్ల మేర సేకరించవచ్చునని ప్రాథమికచర్చల సమాచారం. దీంతో కంపెనీ వ్యాల్యూయేషన్‌ 48 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. బైజుస్‌ స్టార్టప్‌ వ్యాల్యూ 21 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ సీబీ ఇన్‌సైట్స్‌ అంచనా వేసింది. కాగా ఐపీవోకి సంబంధించిన ప్రకటన జనవరి 2022లో వీలైనంత తరగా వచ్చే అవకాశాలున్నాయి. చర్చలు ఇంకా ఖరారవలేదు. బైజుస్‌ లేదా చర్చిల్‌ మధ్య ఒప్పందం ఇంకా ఖరారవ్వలేదు. కాబట్టి ఐపీవో వచ్చే ఏడాది ఉంటుందని ఓ బైజుస్‌ వర్గాలు వెల్లడించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement