కాల్పులతో దద్దరిల్లుతోంది ఇరాక్ రాజధాని బాగ్దాద్. దేశ రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రముఖ షియా మతగురువు ముక్తాదా అల్-సదర్ ప్రకటించడం వల్ల ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ ప్యాలెస్పై వందలాది మంది నిరసనకారులు దాడులకు పాల్పడ్డారు. ప్యాలెస్ గోడలను బద్దలు కొట్టి.. భవనంలోకి చొచ్చుకుపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులను నిలువరించేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20 మంది మరణించగా, మరో వంద మంది గాయపడ్డారు. తాజా ఘటనతో దేశవ్యాప్తంగా సైన్యం కర్ఫ్యూ విధించింది. కేబినెట్ సమావేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది ప్రభుత్వం.
Advertisement
తాజా వార్తలు
Advertisement