ఢిల్లీలో బాంబు కలకలం రేగింది. సీమాపురి ప్రాంతంలో ఓ బ్యాగు అందరినీ భయాందోళకి గురి చేసింది. దాంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆ బ్యాగును పరిశీలించగా, అందులో ఐఈడీ పేలుడు పదార్థాలు ఉన్నట్టు వెల్లడైంది. వెంటనే ఎన్ఎస్ జీ బలగాలకు సమాచారం అందించారు. వారు ఆ బ్యాగును మైదాన ప్రాంతానికి తీసుకెళ్లి పేల్చివేసేందుకు ఏర్పాట్లు చేశారు. గత నెలలో ఘాజీపూర్ వద్ద ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు లభ్యం కాగా, విచారణలో సీమాపురి ప్రాంతంలోని ఇంటిపైనే అనుమానాలు తలెత్తాయి. దాంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరుకోగా, పేలుడు పదార్థాలతో కూడిన బ్యాగు కనిపించింది. కాగా, ఆ ఇంట్లో ఉంటున్న నలుగురు యువకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం తీవ్ర గాలింపు జరుగుతోంది.ఆ ఇల్లు ఖాసిం అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. ఓ ప్రాపర్టీ డీలర్ ద్వారా ఒక కుర్రాడికి సెకండ్ ఫ్లోర్ అద్దెకు ఇచ్చారు. ఆ తర్వాత కొన్నిరోజులకు మరో ముగ్గురు కుర్రాళ్లు కూడా వచ్చి ఆ ఇంట్లో మకాం వేసినట్టు గుర్తించారు.
3కేజీల ఐఈడీ బ్యాగ్ – నలుగురు నిందితులు పరార్
Advertisement
తాజా వార్తలు
Advertisement