2024 పారిస్ ఒలింపిక్, పారాలింపిక్ క్రీడల వరకు ‘స్పిన్ సర్వ్’పై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు బ్యాడ్మింటన్ గవర్నింగ్ బాడీ సోమవారం వెల్లడించింది. కొత్త స్టైల్ సర్వింగ్‌లో ఆటగాడు షటిల్ కాక్‌ను ప్రారంభించడానికి ముందు దాన్ని తిప్పడం ద్వారా ప్రత్యర్థికి కష్టతరం చేయడం ఇటీవల వివాదాస్పదమైంది. దీనిపై బీడబ్ల్యుఎఫ్ స్పందించింది. ఆటకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని పేర్కొంటూ ఈ తరహా సర్వ్‌ను మే నెలలో తాత్కాలికంగా నిషేధించింది.
మంగళవారం నుంచి ప్రారంభమయ్యే థాయ్‌లాండ్ ఓపెన్ 2023లో తాజా ఆదేశాలు వరిస్తాయని బిడబ్ల్యుఎఫ్ తెలిపింది. కాగా, బిడబ్ల్యుఎఫ్ సెక్రటరీ జనరల్ థామస్ లండ్ స్పిన్‌సర్వ్‌ని స్వాగతించారు, అయితే సర్వ్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ముందు అభ్యంతరాలను పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు.