పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారిణి పీవీ సింధూ శుభారంభం చేసింది. రెండో రోజు జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో అలవోకగా గెలిచింది. మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా నబాన అబ్దుల్ రజాక్‌ను కేవలం 29 నిమిషాల్లోనే ఓడించింది. ఫాతిమా రజాక్‌పై 21-9, 21-6 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. కాగా, గ్రూప్ స్టేజిలో ఎస్తోనియాకు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ క్రిస్టినా కూబాతో బుధవారం సింధు తలపడనుంది.
డబుల్స్ లో నిరాశ
మహిళల డబుల్స్ విభాగంలోభారత్ కు నిరాశ మిగిలింది. నేడు జరిగిన తొలిరౌండ్ పోటీలో తానిషా, అశ్విని జోడి 18- 21, 10 – 21 స్కోర్ తో కొరియన్ పెయిర్ కిమ్ , కాంగ్ చేతిలో ఓడిపోయారు..
రోయింగ్ క్వార్టర్ లో బాలరాజ్
రోయింగ్‌లోని రిఫెఛేజ్ విభాగంలో భారత అథ్లెట్ బాలరాజ్ పన్వార్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. రిఫెఛేజ్ విభాగంలో మొనాకో అథ్లెట్ క్వింటిన్ ఆంటోగ్నెల్లి ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. బాలరాజ్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.