జులై 1 నుంచి 10 వరకు జరగాల్సిన గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ లీగ్ (జీపీబీఎల్) టోర్నమెంట్ వాయిదా పడింది. ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ క్యాలెండర్, ఇతర నేషనల్ టోర్నమెంట్స్‌ను దృష్టిలో ఉంచుకుని లీగ్ టోర్నీని వాయిదా వేసినట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం… బ్యాడ్మింటన్ లీగ్ టోర్నీ ఆగస్టు 12న ప్రారంభమై, 21న ముగుస్తుందన్నారు. ఈ టోర్నీలో మొత్తం 8 టీమ్‌లు పాల్గొంటాయని తెలిపారు. కర్ణాటక బ్యాడ్మింటన్ అసోసియేషన్‌తో కలిసి గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ లీగ్ సంయుక్తంగా టోర్నీ నిర్వహిస్తున్నట్లు వివరించారు.
బెంగళూరు లయన్స్, మంగళూరు షార్క్స్, మండ్య బుల్స్, మైసూర్ పాంథర్స్, మల్నాడ్ ఫాల్కాన్స్, బండిపుర్ టస్కర్స్, కేజీఎఫ్ వోల్ప్స్, కొడగు టైగర్స్ జట్టు పాల్గొననున్నాయి. భారత దిగ్గజ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, హెచ్‌ఎస్ ప్రణయ్‌లు మెంటర్స్‌గా వ్యవహరించనున్నారు. లీగ్ టోర్నీ విజేత జట్టుకు రూ.60 లక్షల ఫ్రైజ్ మనీ, రన్నర్స్‌కు రూ.24 లక్షల ఫ్రైజ్‌మనీగా అందజేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.