Wednesday, November 6, 2024

TG | కవితపై దుష్ప్రచారం… పోలీసులకు బీఆర్‌ఎస్‌వీ ఫిర్యాదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎమ్మెల్సీ కవితపై సామాజిక మధ్యమల్లో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ విద్యార్థి విభాగం డిమాండ్‌ చేసింది. కవితపై అసత్య ప్రచారం చేసిన వ్యక్తులపై చట్టరీత్య చర్యలు చేపట్టని పక్షంలో ప్రత్యేక్ష ఆందోళనలకు సిద్ధం కావల్సి వస్తోందని బీఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

ఈమేరకు డీసీపీ దార కవితకు విద్యార్థి విభాగం ఫర్యాదు చేసింది. శుక్రవారం తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాలు మాట్లాడుతూ తుంగబాలు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ సంబంధించిన సోషల్‌ మీడియా, పార్టీ నాయకులు అధికారిక ఖాతాలలో మహిళా ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్ఫింగ్‌ చేసి ప్రసారం చేశారని తెలిపారు.

కల్వకుంట్ల కవిత కీెర్తి ప్రతిష్టలను భంగం కలిగించే విధంగా పోస్టులను పెడుతూ వారిని అవమానిస్తున్న తీరును డీసీపీ దార కవితకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారి ఖాతాలోని పోస్టులను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మళ్లీ చేస్తే బీఆర్‌ ఎస్‌వీ విద్యార్థి విభాగం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్‌, మేకల విద్యాసాగర్‌ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement