దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన OTT ప్లాట్‌ఫారమ్‌లలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికపప్పుడు అందించే క్వాలిటీ కంటెంట్ కారణంగా ఈ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌కు సబ్‌స్క్రైబర్ లు కూడా ఎక్కువే. దీంతో దేశంలోని ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు చాలా ఖరీదైనవిగా ఉంటాయి.
కాగా, ఇవ్వాల నెట్‌ఫ్లిక్స్ ఇండియా చాలా మంది వినియోగదారులను నిరాశపరిచేలా ఒక అప్‌డేట్ ని ప్రకటించింది. స్ట్రీమింగ్ సర్వీస్ వినియోగదారులు తమ నెట్‌ఫ్లిక్స్ ఎకౌంట్ ఐడీ పాస్‌వర్డ్‌లను ఇంటి వ్యక్తులతో కాకుండా మరెవిరితో కూడా షేరింగ్ జరగకుండా.. పాస్‌వర్డ్ షేరింగ్ ని నియంత్రిస్తున్నట్టు వెల్లడించింది. మే నెలలో.. యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో & బ్రెజిల్ వంటి ప్రముఖ దేశాలతో సహా 100 కంటే ఎక్కువ దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులను విధించింది నెట్‌ఫ్లిక్స్.
ప్రకటనలో భాగంగా.. “నెట్‌ఫ్లిక్స్ ఎకౌంట్ అనేది ఒక కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఆ ఇంటిలో నివసించే ప్రతి ఒక్కరూ నెట్‌ఫ్లిక్స్‌ని వారు ఎక్కడ ఉన్నా (ఇంట్లో, ప్రయాణంలో, సెలవుల్లో ) ఉపయోగించవచ్చు.. ప్రొఫైల్ డీటేయిల్స్ ని షేర్ చేసుకోవచ్చు.” అని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. దాంతో పాటు.. స్ట్రీమింగ్ దిగ్గజం ఇటీవల ముగిసిన త్రైమాసికంలో మొత్తం 238 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో $1.5 బిలియన్ల లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది.
అలాగే “మా సబ్‌స్క్రైబర్ లకు ఎంటర్ టైన్ మెంట్ పరంగా అనేక అభిరుచులు ఉన్నాయని మేము గుర్తించాము. అందుకే మేము అనేక రకాల కొత్త సినిమాలు, టీవీ షోలు- సిరీలస్ లలో భారీగా పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తున్నాము.. దీంతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ లు ఎలాంటి కంటెంట్ ని అయిన ఈజీగా యాక్సెస్ చేయగలరు.. దాంతో నెట్‌ఫ్లిక్స్ చూడటానికి ఎల్లప్పుడూ సంతృప్తికరంగా ఉంటుంది.” అని పేర్కొంది.
నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ఈ కొత్త విధానం గురించి భారతదేశంలోని వినియోగదారులకు ఇమెయిల్ పంపడం ప్రారంభించింది. దీంతో, ఇకపై భారతీయ యూజర్లెవరూ తమ నెట్‌ఫ్లిక్స్ ఖాతాను తమ స్నేహితులతో పంచుకోవడం సాధ్యం కాదు. ఈ అప్‌డేట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అందుబాటులోకి వస్తాయి.