Tuesday, November 26, 2024

పసిడిప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్

బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఈరోజు మాత్రం పైపైకి కదిలాయి. జూలై 2న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1310 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.52,200కు ఎగసింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.1200 పెరిగింది. దీంతో ఈ బంగారం రేటు పది గ్రాములకు రూ.47,850కు చేరింది. బంగారం కొనాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బంగారం రేటు ర్యాలీ చేస్తే వెండి రేటు మాత్రం రివర్స్ గేర్‌లో నడిచింది. సిల్వర్ రేటు దిగివచ్చింది. వెండి ధర కేజీకి రూ. 100 తగ్గుదలతో రూ. 65 వేలకు క్షీణించింది.

15 శాతం పైకి సుంకాలు
బంగారం దిగుమతులపై భారత ప్రభుత్వం సుంకాలను 5 శాతం మేర పెంచేసింది. ఇది వరకు 7.5 శాతంగా ఉన్న సుంకం ఇప్పుడు 12.5 శాతానికి చేరింది. దీనికి జీఎస్‌టీ, ఇతర సెస్‌లను కలుపుకుంటే దిగుమతి సుంకా 15 శాతానికి పైగా చేరినట్లు అవుతుంది. కరెంట్ అకౌంట్ లోటును తగ్గించుకోవాలని లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అమెరికా డాలర్‌తో ఇండియన్ రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేయాలని కేంద్రం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement