రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇల్లంతకుంట మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద మంత్రి కేటీఆర్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, అందుకోసం ఉద్యోగ నోటిఫికేషన్‌లను ప్రభుత్వం విడుదల చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే మంత్రి కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి పలువురు ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడి ఘటనలో పలువురు ఏబీవీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కాగా నిరుద్యోగుల నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతోనే తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఏబీవీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement