రాజమండ్రిని సర్వం సుందరంగా తీర్చిదిద్దితే టిడిపి నాయకులు మహానాడు పేరుతో నాశనం చేస్తున్నారని ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రోడ్డంతా కన్నాలు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రికి 15 కిలోమీటర్ల దూరంలో మహానాడు కార్యక్రమం చేస్తున్నారని, మరి ఊర్లో హడావుడి ఎందుకు అని నిలదీశారు. దండి మార్చ్ విగ్రహాల చుట్టూ టిడిపి జెండాలు కట్టించారు.. టిడిపి నాయకులు ఎంత కండకావరం ఉంటే ఇవన్నీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోట్లు పొడవడం ఎందుకు.. శత జయంతి ఉత్సవాలు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. రాజమండ్రి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్న నాయకుడు చంద్రబాబు కాదా?, మృతి చెందిన వారి కుటుంబాలను ఏనాడైనా మీరు గాని మీ కుమారుడిగాని పరామర్శించారా అని మండిపడ్డారు. విశాలమైన గ్రౌండ్ లో పబ్లిసిటీ కోసం హడావుడి చేయకండి, పుష్కరాల్లో ఘటన జరిగితే దానికి టిడిపి నేతలే బాధ్యత వహించాలని ఎంపీ భరత్ కోరారు.
వెన్నుపోటు పొడిచి.. శత జయంతి ఉత్సవాలు ఎందుకు? : ఎంపీ మార్గాని
Advertisement
తాజా వార్తలు
Advertisement